అనంతపురం జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడులోదారుణ.హత్య.
అనంతపురం 27 మార్చి (హి.స.),:అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో అపహరణకు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చిన్నారికి బావ వరసయ్యే సర్వేశ్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలుడు హేమచంద్రను అతి దారుణంగా బండరాళ్లతో
అనంతపురం జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడులోదారుణ.హత్య.


అనంతపురం 27 మార్చి (హి.స.),:అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో అపహరణకు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చిన్నారికి బావ వరసయ్యే సర్వేశ్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలుడు హేమచంద్రను అతి దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చిన్నారి హేమచంద్ర హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

హేమచంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన రౌడీ షీటర్ సర్వేశ్ను, క్రైమ్ సీన్ రీ-కన్స్ట్రక్షన్ నిమిత్తం పోలీసులు శుక్రవారం చింతలాయపల్లి-కుందనకోట ఘాట్ రోడ్డు ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితుడు పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు హెచ్చరించినప్పటికీ అతను వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు సర్వేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల అనంతరం నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని, చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande