అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా రాజధాని అమరావతి
అమరావతి, 27 మార్చి (హి.స.)అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా రాజధాని అమరావతి రూపు దిద్దుకుంటోంది. ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన పలు విద్యాసంస్థలు అమరావతిలో కొలువు తీరాయి. మరికొన్ని తమ విద్యాసంస్థలను స్థాపించే పనుల్లో బిజీగా ఉన్నాయి
అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా రాజధాని అమరావతి


అమరావతి, 27 మార్చి (హి.స.)అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా రాజధాని అమరావతి రూపు దిద్దుకుంటోంది. ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన పలు విద్యాసంస్థలు అమరావతిలో కొలువు తీరాయి. మరికొన్ని తమ విద్యాసంస్థలను స్థాపించే పనుల్లో బిజీగా ఉన్నాయి. కేజీ నుంచి పీజీ వరకూ అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలకు కూడలిగా రాజధాని కొత్త రూపం సంతరించుకుంటోంది.

అమరావతిలో తొట్టతొలిగా అడుగుపెట్టిన విద్యాసంస్థ విట్ ఏపీ యూనివర్సిటీ. 2017లో ఈ సంస్థ 600 మందితో శాఖమూరులో ప్రారంభమైంది. ఇప్పుడది 19,000 మంది విద్యార్థుల సామర్థ్యానికి చేరింది. వంద ఎకరాల్లో ప్రారంభమెన ఈ సంస్థ ఇప్పుడు 200 ఎకరాలకు విస్తరించబోతోంది. కురగల్లు- నీరుకొండలో ఏర్పాటైన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఇక్కడ 15,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటితోపాటు మాతా అమృతానందమయి ఆధ్వర్యంలో ‘అమృత యూనివర్సిటీ’ నడుస్తోంది. రాజధాని విద్యావనంలో మరో కలికుతురాయి ఇది. పూర్తిస్థాయి కార్యకలాపాలకు వీలుగా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నారు. మరో జాతీయ స్థాయి సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ) కూడా నాలుగేళ్లుగా విద్యాసేవలు అందిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande