వాణిజ్య గ్యాస్ సరఫరాను 70 శాతానికి పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ, 27 మార్చి (హి.స.) దేశంలోని వివిధ హోటళ్లకు, పారిశ్రామిక రంగాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా ఉన్న ఇంధన కొరతను అధికమించేలా వాణిజ్య గ్యాస్ (Commercial LPG) సరఫరాను 70 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశా
Commercial gas


న్యూఢిల్లీ, 27 మార్చి (హి.స.) దేశంలోని వివిధ హోటళ్లకు, పారిశ్రామిక రంగాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా ఉన్న ఇంధన కొరతను అధికమించేలా వాణిజ్య గ్యాస్ (Commercial LPG) సరఫరాను 70 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి గ్యాస్ నౌకలు భారత్కు చేరుకుంటుండటంతో సరఫరాపై ఉన్న ఆంక్షలను సడలించి, పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకునేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డా. నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. గతంలో ఉన్న 50 శాతం కోటాను ఇప్పుడు 70 శాతానికి పెంచినట్లు అందులో పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సరఫరా అడ్డంకులను అధిగమించి, దేశీయంగా ఇంధన లభ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

పెంచిన గ్యాస్ సరఫరాలో ముఖ్యంగా ఉపాధి కల్పించే కీలక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కేంద్రం సూచించిన జాబితా ప్రకారం ఈ క్రింది రంగాలకు లబ్ధి చేకూరనుంది. గత కొన్ని వారాలుగా పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గ్యాస్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడింది. అయితే, అమెరికా, అర్జెంటీనా వంటి దేశాల నుంచి గ్యాస్ నౌకలు నిరంతరాయంగా భారత పోర్టులకు చేరుకుంటుండటంతో ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చింది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు భారీ పరిశ్రమలకు కూడా గ్యాస్ కొరత తీరనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande