సైబర్ నేరగాళ్ల వలలో వరంగల్ NIT మాజీ ప్రొఫెసర్.. రూ. కోటి స్వాహా
వరంగల్, 27 మార్చి (హి.స.) చదువుకున్న వారు, మేధావులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పన్నాగాలు పన్నుతున్నారు. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన సుధాకర్ అనే వ్యక్తి.. ఆన్లైన్ ట్రేడింగ్ (Stock Market) మోసా
Cyber fraud


వరంగల్, 27 మార్చి (హి.స.)

చదువుకున్న వారు, మేధావులే

లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పన్నాగాలు పన్నుతున్నారు. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన సుధాకర్ అనే వ్యక్తి.. ఆన్లైన్ ట్రేడింగ్ (Stock Market) మోసానికి గురై తన జీవితకాల సంపాదనను కోల్పోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు కోసం సుధాకర్ ఆన్లైన్లో వెతుకుతున్న క్రమంలో ఒక లింక్ కనిపించింది. దాన్ని క్లిక్ చేయగానే ఆయన వాట్సాప్ నంబర్ సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లింది. వెంటనే అతడిని “H_18” అనే వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఆ గ్రూప్ లో ఫేక్ ప్రాఫిట్స్ స్క్రీన్ షాట్లను చూపిస్తూ నిందితులు నమ్మించారు.

గ్రూప్లో 'కిరణ్' అనే వ్యక్తి తనను తాను ఒక ప్రముఖ కంపెనీ అకౌంట్స్ మేనేజర్గా పరిచయం చేసుకున్నాడు. వారి మాటలు నమ్మిన సుధాకర్.. ఈ ఏడాది జనవరి నుంచి విడతల వారీగా నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేశారు. ఇలా మూడు నెలల కాలంలో మొత్తం రూ. 1,00,001,000 పంపించారు. పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు యాప్లో కనిపించినప్పటికీ, ఆ డబ్బును విత్ డ్రా (Withdraw) చేసుకోబోతే సాంకేతిక సమస్యలు వస్తున్నాయి అంటూ నిందితులు మాట దాటవేస్తూ వచ్చారు.

చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూపుల్లో ఇచ్చే స్టాక్ మార్కెట్ టిప్స్ నమ్మవద్దని, అధిక లాభాల ఆశ చూపిస్తే అది కచ్చితంగా మోసమేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని లేదా అఫీషియల్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande