పునర్విభజన పై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలలో ఆశలు! మరో ఆరు కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం
హైదరాబాద్, 27 మార్చి (హి.స.) అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరియు వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలు ఉన్నా
D limitation


హైదరాబాద్, 27 మార్చి (హి.స.)

అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరియు వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. పునర్విభజన ద్వారా 50 శాతం సీట్లను పెంచితే ఉమ్మడి జిల్లాలో 6 కొత్త నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. వీటితో పాటు కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఏర్పడే అవకాశం ఉంది. 18కి చేరనున్న నియోజకవర్గాలు.. పరకాల, ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, జనగామ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ నగరంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 9 లక్షల జనాభా ఉంది. ప్రస్తుతం ఈ 15 ఏళ్లలో జనాభా భారీగా పెరిగింది. వరంగల్ నగరం పరిధిలో 16 లక్షల వరకు జనాభా ఉంటుందని అంచనాకు వస్తున్నారు. ప్రస్తుతం 4 నియోజకవర్గాల పరిధిలో నగరం ఉన్న 80 శాతం జనాభా వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల పరిధిలోనే ఉంది. కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా లెక్కల ప్రకారం వరంగల్ నగరం పరిధిలోనే 4 నియోజకవర్గాలు

ఏర్పడే అవకాశం ఉంది.

వరంగల్, హన్మకొండ, కాజీపేట్, హసన్పర్తి నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. జనాభా రీత్యా నగరం పరిధిలోనే రెండు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడేందుకు అవకాశం ఉంది. హసన్పర్తి నియోజకవర్గం ఏర్పడితే నగరం జనాభాతో పాటు పక్కనే ఉన్న ఎల్కతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి మండలాలు కలిపి ఏర్పడేందుకు అవకాశం ఉంది. కాజీపేట పరిధిలో జనాభా పెరగడం కొత్త మండలాలు, వేలేరు, చిల్పూరుగుట్ట, ధర్మసాగర్ ను కలిపే అవకాశం ఉంది. వరంగల్ రూరల్ పరిధిలో కూడా నర్సంపేట నియోజకవర్గం ఉండగా సిటీ పరిధి ఆనుకొని కొత్త నియోజకవర్గం గీసుకొండ లేదా కేసముద్రం, నెక్కొండ కేంద్రంగా కొత్త నియోజకవర్గంకు అవకాశం ఉంది. జనగామ మున్సిపాలిటీ లో జనాభా పెరగడంతో అక్కడ కూడా కొత్త నియోజకవర్గం ఏర్పడేందుకు అవకాశం ఉంది. జనగామ పరిధిలో ఉన్న మండలాలను కొన్ని పాలకుర్తి కలిపి తొర్రూర్ కొత్త నియోజకవర్గం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు నేతలు భావిస్తున్నారు. ములుగు జిల్లా పరిధిలోనూ ఏటూరునాగారం కొత్త నియోజకవర్గం ఏర్పడేందుకు అవకాశం ఉంది. వెంకటాపురం, వాజేడు మండలాలు ములుగు జిల్లా పరిధిలో ఉండడంతో నియోజకవర్గం ఐటీడీఏ కేంద్రంగా ఏర్పడుతుందని భావిస్తున్నారు.

భూపాలపల్లి జిల్లా పరిధిలో కాటారం కేంద్రంగా మహదేవ్ పూర్, మహముత్తారం, మల్హర్, కాళేశ్వరం మండలాలు కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా వరంగల్ పరిధిలో కొత్తగా ఒక పార్లమెంట్ నియోజకవర్గం జనాభా ఆధారంగా ఏర్పడేందుకు అవకాశం ఉంది. గతంలో వరంగల్ తో పాటు హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గం ఉండేది. డీలిమిటేషన్ తో నియోజకవర్గం కనుమరుగైంది. కొత్తగా పునర్విభజన జరిగితే మళ్లీ హన్మకొండ నియోజకవర్గం ఏర్పడేందుకు అవకాశం ఉంది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande