
హైదరాబాద్, 27 మార్చి (హి.స.)
ఫ్యూచర్ సిటీ ఏరియాకు సమగ్ర మాస్టర్ ప్లాన్-2047 రూపకల్పనకు ప్రభుత్వం నిర్ణయించింది. అందు కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) జారీ చేసిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ద్వారా 17 జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలు వీటిలో ఏడు ముందుకొచ్చాయి. అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి.
ఫ్యూచర్ సిటీ మాస్టర్-2047 రూపొందించడానికి ఏజెన్సీని ఫైనల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఎవాల్యూషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్గా ఎఫ్సీడీఏ కమిషనర్, సభ్యులుగా డీటీసీపీ డైరెక్టర్, హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్/జాయింట్ సెక్రెటరీ, జేఎన్ఏఎఫీయూ ప్రొఫెసర్ ఎస్. కుమార్ ఉన్నారు. ఈ కమిటీ ఆర్ఎఫ్పీలో నిర్దేశించిన నిబంధనలు, మూల్యాంకన ప్రమాణాలకు అనుగుణంగా, బిడ్డర్లు సమర్పించిన సాంకేతిక అర్హతలు, సంబంధిత అనుభవం, మాస్టర్ ప్లాన్ రూపొందించే విధానం, పద్ధతి, అలాగే ఆర్థిక ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత కన్సల్టెన్సీని ఫైనల్ చేయనున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. వచ్చే నెల 15 లోపు మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేయడానికి అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు