రూ.217 కోట్ల భారీ GST స్కామ్ వెలుగులోకి.. DGGI అధికారుల దాడులు
హైదరాబాద్, 27 మార్చి (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) అధికారులు భారీ జీఎస్టి కుంభకోణాన్ని బయటపెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు, ఏకంగా రూ.217
GST scam


హైదరాబాద్, 27 మార్చి (హి.స.)

తెలుగు రాష్ట్రాల్లో డైరెక్టరేట్ జనరల్

ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) అధికారులు భారీ జీఎస్టి కుంభకోణాన్ని బయటపెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు, ఏకంగా రూ.217 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లుగా జరిగినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సుమారు 72 షెల్ కంపెనీల నెట్వర్క్ విచారణలో బట్టబయలైంది. ఎలాంటి ఎటువంటి వస్తువుల సరఫరా, సర్వీసు లేకుండా కేవలం ఫేక్ డాక్యుమెంట్లతో రూ.1,472 కోట్ల విలువైన కృత్రిమ లావాదేవీలను సృష్టించినట్లుగా తెలుస్తోంది.

నకిలీ లావాదేవీలతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని ఎగ్గొట్టడమే కాకుండా, తప్పుడు పద్ధతిలో రూ.2.17 కోట్ల మేర ఐటీసీని క్లెయిమ్ చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ మేరకు హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయాలతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో DGGI అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో కీలకమైన డిజిటల్ సాక్ష్యాధారాలు, నకిలీ ఇన్వాయిస్ కాపీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ కుంభకోణానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande