బిజెపికి రూ.6,074.015 కోట్ల విరాళాలు. గత ఏడాది తో పోలిస్తే 171 శాతం ఎక్కువ..
న్యూఢిల్లీ, 27 మార్చి (హి.స.) దేశంలోని రాజకీయ పార్టీలకు కార్పొరేట్ శక్తులకున్న అనుబంధాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన తాజా నివేదిక బట్టబయలు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి (FY 2025) సంబంధించి రాజకీయ పార్టీలకు అ
బిజెపి


న్యూఢిల్లీ, 27 మార్చి (హి.స.)

దేశంలోని రాజకీయ పార్టీలకు కార్పొరేట్ శక్తులకున్న అనుబంధాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన తాజా నివేదిక బట్టబయలు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి (FY 2025) సంబంధించి రాజకీయ పార్టీలకు అందిన వివరాల ప్రకారం.. భారతీయ జనతా పార్టీ (BJP)కి ఏకంగా రూ.6,074.015 కోట్ల విరాళాలు అందాయి. ఇది గత ఏడాది (రూ.2,243.947 కోట్లు) తో పోలిస్తే 171 శాతం భారీ వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. మొత్తం 5,522 విరాళాల ద్వారా ఈ మొత్తం సమకూరింది. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) కూడా తన విరాళాలను 84 శాతం పెంచుకుని 2,501 విరాళాల ద్వారా రూ. 517.394 కోట్లను సేకరించింది.

ఈ నివేదికలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, జాతీయ పార్టీలకు అందిన మొత్తం విరాళాలలో బీజేపీ వాటా ఏకంగా 91 శాతంగా ఉండటం. జాతీయ పార్టీలన్నింటికీ కలిపి వచ్చిన సుమారు రూ. 6,648.563 కోట్ల విరాళాలలో ఒక్క బీజేపీయే సింహభాగం కైవసం చేసుకుంది. మిగిలిన నాలుగు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఆప్, సిపిఐ(ఎం), ఎన్పిఈపి)లు కేవలం రూ.574 కోట్లు మాత్రమే సేకరించగలిగాయి. అంటే, ఇతర పార్టీలన్నింటి కంటే బీజేపీకి సుమారు 10 రెట్లు ఎక్కువ నిధులు అందాయి. ముఖ్యంగా కార్పొరేట్ విరాళాల విషయంలో బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి అందిన రూ. 5,717 కోట్ల కార్పొరేట్ విరాళాలు, ఇతర జాతీయ పార్టీల కార్పొరేట్ విరాళాల మొత్తం కంటే 13 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ రద్దు తర్వాత, ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా నిధులు మళ్లడం, ఎన్నికల సంవత్సరం కావడం వల్ల విరాళాల ప్రవాహం ఈ స్థాయిలో పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande