

సంగారెడ్డి, 27 మార్చి (హి.స.)
సంగారెడ్డి పట్టణంలో రామ్ మందిర్ ఆలయానికి రూ.2.50 కోట్ల విలువ చేసే అభరణాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పించారు. శ్రీరామనవమి సందర్భంగా జగ్గారెడ్డి, నిర్మల దంపతులు కూతురు, కొడుకుతో కలిసి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపుగా వారి ఇంటి వద్ద నుంచి ఆభరణాలు తీసుకుని వెళ్లి ఆలయంలో సమర్పించారు.
రంగ పేట పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఘనంగా సీతారాముల కళ్యాణం జరపనున్నారు. జగ్గారెడ్డి, ఆయన మిత్రులు, రామ్ మందిర్ యువసేన, రామ్ మందిర్ ఆలయ కమిటీ పెద్దల సహకారంతో రామ సీతారాముల కోసం ప్రత్యేకంగా తయారు రూ.2.50 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించారు.
సీతారాముల వారికి 2 కిలోల 250 గ్రాముల బంగారంతో కర్ణభరనాలతో కూడిన కిరీటాలు, కంటాభరణాలు, వడ్డానాలు, పద్మ పాదాలు, ధనుస్సు, బాణం, యజ్ఞోపవేతం, నయనాలు, తిలకాలు, ముక్కు పోగు, శంఖు చక్రాలు, అమ్మవారికి మంగళసూత్రం అమ్మవారికి కమల హస్తం, శ్రీ రాముల వారికి శరం తో కూడిన హస్తం ఉన్నాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు