
అమరావతి, 27 మార్చి (హి.స.)
సీఎం సమక్షంలో మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయనకు సీఎం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి అచ్చెన్నాయుడికి తినిపించారు. అచ్చెన్నకు పలువురు మంత్రులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఉండవల్లి నివాసంలోనూ మంత్రి లోకేశ్ సమక్షంలో కేక్ కట్ చేసి అచ్చెన్న జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఉండవల్లి నివాసంలో మంత్రి లోక్శ్తో జరిగిన అల్పాహార విందు సమావేశంలో పలువురు మంత్రులు పెన్షన్ల అంశాన్ని ప్రస్తావించారు. నియోజకవర్గంలో ఎక్కువ మంది పెన్షన్లు కావాలని అడుగుతున్నారని చెప్పగా, దానిపై కసరత్తు జరుగుతోందని లోకేశ్ తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ స్థాయిలోనూ కార్యక్రమాలు నిర్వహించాలని లోకేశ్ సూచించారు. సీనియర్ నేతలతో కలిసి భోజనాలు చేయాలని, ఐటీడీపీ వాళ్లను బాగా పనిచేస్తున్న అనుబంధ
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ