వేములవాడలో శ్రీరామనవమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
వేములవాడ, 27 మార్చి (హి.స.) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేమ
మంత్రి పొన్నం


వేములవాడ, 27 మార్చి (హి.స.) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ముందుగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రికి, విప్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలకగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కల్యాణోత్సవానికి తీసుకువచ్చిన పట్టువస్త్రాలను స్వామివారికి అందజేశారు.

పూజానంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ అతిథి గృహంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. శివార్చన వేదికపై నిర్వహించనున్న కల్యాణ వేడుకల ఏర్పాట్ల పై చర్చించారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు, ఆర్డీవో రాధాబాయి, ఆలయ ఈఓ రమాదేవి, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ జయంత్ కుమార్ తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande