ఆధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండటం ఎంతో అవసరం.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి
యాదాద్రి భువనగిరి, 27 మార్చి (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని చిన్న కొండూరు రోడ్డులో లావణ్య డయాగ్నస్టిక్ సెంటర్ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి-లక్ష్మీ దంపతులు ప్రారంభించారు. అలాగే, విద్యుత్ సబ్ స్టేషన్
ఎమ్మెల్యే కోమటిరెడ్డి


యాదాద్రి భువనగిరి, 27 మార్చి (హి.స.)

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని చిన్న కొండూరు రోడ్డులో లావణ్య డయాగ్నస్టిక్ సెంటర్ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి-లక్ష్మీ దంపతులు ప్రారంభించారు. అలాగే, విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన మనమండి హోటల్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

పట్టణ ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలు అందించేందుకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే, మన మండి హోటల్లో ను రుచికరమైన బిర్యానీ అందించి కస్టమర్లను ఆకర్షించాలని సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పబ్బు రాజు గౌడ్, చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మొగుదాల రమేష్ గౌడ్, ఉబ్బు వెంకటయ్య, వైద్య సిబ్బంది, బోయ అంబేద్కర్, దుబ్బాక ఆకాష్ రెడ్డి, గొడుగు మహేష్ తదితరులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande