
అమరావతి, 27 మార్చి (హి.స.) రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్ఎన్ఎ్సఎస్) ప్రాజెక్టు 7, 8 ప్యాకేజీ పనులు సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టు సంస్థను తప్పించాలన్న జలవనరుల శాఖ నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఈ రెండు ప్యాకేజీల ద్వారా సిమెంట్ లైనింగ్ వేసేందుకు కాంట్రాక్టు సంస్థకు గతంలో పనులు అప్పగించారు. హెచ్ఎన్ఎ్సఎస్ ప్రధాన కాలువ అభివృద్ధి పనులు రూ.606.03 కోట్లతో చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్యాకేజీ-36 పనులు చేపట్టిన కాంట్రాక్టరు సరిగా పనిచేయకపోవడంతో అతడిని తొలగించారు. ఈ ప్యాకేజీ పూర్తయితే మరో 55,608 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ