
పెద్దపల్లి, 27 మార్చి (హి.స.)
రామగుండం ఆర్ఎఫ్సీఎల్లో సాంకేతిక లోపాలు, పైప్లాన్ లీకేజీల కారణంగా వరుస షట్గాన్లు ఏర్పడి యూరియా ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగింది. గత కొన్ని నెలల్లో సుమారు 46రోజుల పాటు ప్లాంట్ మూతపడడంతో 1.77 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయి, కంపెనీకి రూ.120కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ప్లాంట్ నిర్మాణంలోనే నాసిరకం పరికరాలు వాడడం వల్ల ఈ వైఫల్యాలు తలెత్తుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత ఏర్పడడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల రైతులు యూరియా కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. పర్యవేక్షణ లోపాన్ని నివారించేందుకు నోయిడాలోని ప్రధాన కార్యాలయాన్ని తక్షణమే రామగుండం లేదా హైదరాబాద్కు మార్చాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఖరీఫ్ వంటి కీలక సీజన్లో ఉత్పత్తి ఆగిపోవడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎరువుల కొరత ఏర్పడింది. రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్లాంట్లో ఉపయోగిస్తున్న హెచ్ఆర్ (HTR) టెక్నాలజీ వైఫల్యాలు, నాణ్యత లేని పైపైన్ల వాడకం, నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్లాంట్ 70 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నప్పటికీ, మళ్లీ ఎప్పుడు షట్ డౌన్ అవుతుందోనన్న భయం అధికారులను వెంటాడుతోంది. యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ కొరత ఏర్పడటం, ఆపై సాంకేతిక లోపాలు తోడవ్వడంతో ఉత్పత్తి పునఃప్రారంభానికి మరో పది రోజులు పట్టే అవకాశం ఉంది.
ప్లాంట్ నిర్మాణ సమయంలోనే భారీగా అక్రమాలు జరిగాయని, తక్కువ ధర పరికరాలను వాడటం వల్లే తరచూ షట్డౌన్లు అవుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, నిర్ణయాల జాప్యాన్ని నివారించడానికి నోయిడాలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని రామగుండం లేదా హైదరాబాద్కు మార్చాలని కార్మిక సంఘాలు, రాజకీయ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇకనైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఎరువుల సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..