సామాన్యులపై భారం పడొద్దనే ఈ నిర్ణయం.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
హైదరాబాద్, 27 మార్చి (హి.స.) పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల (West Asia Crisis) నేపథ్యంలో దేశంలో వినియోగదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం వినియోగించే పెట్రోల్, డీజిల్పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని (Central
నిర్మల సీతారామన్


హైదరాబాద్, 27 మార్చి (హి.స.)

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల (West Asia Crisis) నేపథ్యంలో దేశంలో వినియోగదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం వినియోగించే పెట్రోల్, డీజిల్పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని (Central Excise Duty) లీటరుకు రూ.10 చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, ఆ భారం సామాన్య పౌరులపై పడకుండా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడటమే తమ ముందు ఉన్న లక్ష్యమని వెల్లడించారు. దేశీయ అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో ఉండేలా చూసేందుకు విదేశాలకు ఎగుమతి చేసే డీజిల్పై లీటరుకు రూ.21.5 పైసల సుంకం, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై లీటరుకు రూ.29.50 పైసలు పన్ను విధించామని అన్నారు. తాజా నిర్ణయంతో చమురు కంపెనీలు లాభాల కోసం విదేశాలకు ఇంధనాన్ని తరలించకుండా, దేశీయ మార్కెట్కే ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు కఠినతరం చేశామని. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంటుకు అధికారికంగా సమాచారం అందించిందని స్పష్టం చేశారు. పౌరుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా, అంతర్జాతీయ మార్కెట్లలో ధరల ఒడిదుడుకుల నుంచి సామాన్యుడిని కాపాడేందుకు ప్రధాని మోదీ ఎల్లప్పుడూ కృషి చేస్తారని ఆర్థిక మంత్రి కేంద్ర నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande