దేశంలో లాక్ డౌన్ విధింపు ఆలోచన ఏదీ లేదు.. కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ, 27 మార్చి (హి.స.) దేశంలో ఇంధన కొరత కారణంగా లాక్డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియాలో, కొన్ని వార్తా సంస్థల్లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర
లాక్ డౌన్


న్యూఢిల్లీ, 27 మార్చి (హి.స.)

దేశంలో ఇంధన కొరత కారణంగా

లాక్డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియాలో, కొన్ని వార్తా సంస్థల్లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేసారు. ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాపై ఆందోళనలు ఉన్నప్పటికీ, దేశంలో లాక్డౌన్ విధించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ప్రజలు ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని, ఇవన్నీ కేవలం అవాస్తవాలని కొట్టిపారేశారు. దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా గొలుసులో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రజలకు ఒక కీలక విన్నపం చేశారు. అనవసరమైన భయాందోళనలకు లోనై పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కట్టవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వం ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉందని, ముందస్తు వ్యూహాలతో చమురు నిల్వలను పర్యవేక్షిస్తున్నామని ఆయన ప్రకటించారు. భారత్ తన ఇంధన అవసరాల కోసం వివిధ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, ఎక్కడా కొరత ఏర్పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande