
తిరుమల , 27 మార్చి (హి.స.)
తిరుమల భక్తజన సంద్రమైంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వీకెండ్, లాంగ్ వీకెండ్ సమయాల్లో తిరుమలలో భక్తుల రద్దీ అమాంతం పెరుగుతోంది. నేటి నుంచి మూడురోజులపాటు బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, ఐటీ కంపెనీలకు సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు పెరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ దర్శనాలకు పట్టే సమయాలను టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.
టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి దాదాపు 12 నుండి 15 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకునే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న (మంగళవారం) మొత్తం 65,600 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,292 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి Rs. 4.18 కోట్ల ఆదాయం లభించింది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి Rs. 4.18 కోట్ల ఆదాయం లభించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV