కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావడం తో గ్రామ పంచాయతీలకు నిధుల వరద పారింది
బుక్కరాయసముద్రం,, 28 మార్చి (హి.స.), : రెండేళ్ల కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గ్రామ పంచాయతీలకు నిధుల వరద పారింది. ఈక్రమంలో పంచాయతీ అభివృద్ధి నిధులను దయ్యాలకుంటపల్లి వైకాపా సర్పంచి ఎస్. రమేష్కు ఆదాయ వనరుగా మారింది. తన బావమరిది పేరుతో చేయ
కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావడం తో గ్రామ పంచాయతీలకు నిధుల వరద పారింది


బుక్కరాయసముద్రం,, 28 మార్చి (హి.స.), : రెండేళ్ల కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గ్రామ పంచాయతీలకు నిధుల వరద పారింది. ఈక్రమంలో పంచాయతీ అభివృద్ధి నిధులను దయ్యాలకుంటపల్లి వైకాపా సర్పంచి ఎస్. రమేష్కు ఆదాయ వనరుగా మారింది. తన బావమరిది పేరుతో చేయని పనులు చేసినట్లు చూపించి రూ.లక్షలు దుర్వినియోగం చేసినట్లు గ్రామప్రజలు స.హ. చట్టం ద్వారా వెలుగులోకి తెచ్చారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో దయ్యాలకుంటపల్లి పంచాయతీకి రూ.9.19 లక్షలు మంజూరయ్యాయి. వచ్చిన నిధుల కంటే అదనంగా రూ.2 లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.7.42 లక్షలు మంజూరు కాగా రూ.8.24 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించారు. సర్పంచి రమేష్ బావమరిది చరణ్సాయి బ్యాంకు ఖాతాకు దాదాపుగా రూ.10 లక్షలు మళ్లించారు. చరణ్సాయి విజయవాడలో పదేళ్లుగా నివాసం ఉంటున్నాడు. గ్రామంలో తాగునీటి పైపులైను పనులు చేశామని, మోటార్లకు మరమ్మతులు చేపట్టామని రెండేళ్లలో చరణ్సాయి ఖాతాకు నిధులు మళ్లించి డ్రా చేశారు. గ్రామంలో నివాసమే లేని వ్యక్తి ఆయా పనులు ఎలా చేస్తారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande