ఆంధ్రప్రదేశ్.స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ పోగ్రామ్ కు విశేష స్పందన
అమరావతి,, 28 మార్చి (హి.స.) విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా ఆన్లైన్ వేదికగా కూటమి ప్రభుత్వం కొత్త ఒరవడి సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా 13-19 ఏళ్ల మధ్య ఉన్న కౌమార విద్యార్థుల కోసం ఇటీవల ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ స్కూలు హెల్త్ అండ్ వె
ఆంధ్రప్రదేశ్.స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ పోగ్రామ్ కు విశేష స్పందన


అమరావతి,, 28 మార్చి (హి.స.)

విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా ఆన్లైన్ వేదికగా కూటమి ప్రభుత్వం కొత్త ఒరవడి సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా 13-19 ఏళ్ల మధ్య ఉన్న కౌమార విద్యార్థుల కోసం ఇటీవల ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ స్కూలు హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రాం డిజిటల్ పోర్టల్కు విశేష స్పందన లభిస్తోంది. బాలబాలికలు.. ముఖ్యం గా వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండడం, లింగ సమానత్వం తదితర అంశాలపై స్వీయ విధానం (సెల్ఫ్ లెర్నింగ్)లో నేర్చుకునేలా ఆరోగ్యశాఖ ‘ఏపీఎస్హెచ్డబ్ల్యూపీ’(apshwp.ap.gov.in)పేరిట కొత్త పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి సత్యకుమార్ శుక్రవారం తెలిపారు. ఈ పోర్టల్లో 11ప్రధాన అంశాల సమాచారాన్ని అందుబాటు లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యం, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉండాలి? నైతిక విలువలు - ప్రాధాన్యం, పౌష్టికాహారం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత, తదితర అంశాలపై 15 నిమిషాల్లోపు ఉండేలా వీడియోలను తెలుగు, ఆంగ్ల భాషల్లో సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబు ఆలోచనల నుంచే ఈ పోర్టల్ ఉద్భవించిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాకు తెలిపారు.

ఇప్పటి వరకూ 36,297 మంది విద్యార్థు లు పోర్టల్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకున్నారని, వీరిలో 75 శాతం మంది బాలికలు ఉన్నారని చెప్పారు. పోర్టల్లో ప్రతి ఈ మాడ్యూల్ నుంచి ప్రశ్న-జవాబు రూపంలో క్విజ్లో పాల్గొన్నవారికి ప్రతిభ ఆధారిత సర్టిఫికెట్లు ఆటోమెటిగ్గా జారీ అవుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధచూపాలని, పేరు, మొబైల్ నంబరు, మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వవచ్చని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande