
హైదరాబాద్, 28 మార్చి (హి.స.)
బోయిన్ పల్లి కూరగాయాల మార్కెట్ యార్డును జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డులా తయారు చేశారని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన కోసం రూ. లక్షల కోట్లు ఖర్చు చేస్తామని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో 9 నెలలుగా చెత్త కాంట్రాక్టర్ కు నెలనెలా రూ.7 లక్షలు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. టాయిలెట్ల వసతులు లేక మార్కెట్ లో మహిళలు శాపనార్థాలు పెడుతున్నారని సంబంధిత వ్యవసాయ మంత్రి సిగ్గుతో రాజీనామా చేయాలని ఈటల డిమాండ్ చేశారు. శనివారం బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో కార్మికులు, వ్యాపారులతో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కార్మికులు, వ్యాపారులు మాట్లాడుతూ.. మార్కెట్ యార్డు లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది.. టాయిలెట్లలో నీటి సరఫరా లేక దుర్గంధ భరితంగా తయారయ్యాయని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని మండిపడ్డారు.వేసవికాలం వల్ల తాగు నీరు లేక అల్లాడుతున్నామని కార్మికులు, వ్యాపారులు ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బోయిన్ పల్లి మార్కెట్ యార్డుకు ప్రతి సంవత్సరం ఏటా రూ.కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు.
తాడోపేడో తేల్చుకుందాం...
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు