
హైదరాబాద్, 28 మార్చి (హి.స.)
మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు (Musi River Rejuvenation Project) లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ మేరకు ఇవాళ రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండల పరిధిలోని మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు పక్కనే ఉన్న వీరభద్ర ఆలయంలో కుటుంబంతో సహా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఇప్పటికే ఆలయ నిర్మాణానికి మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్(Musi River Front Corporation) డిజైన్ ఖరారు చేసింది. చారిత్రక వీరభద్ర స్వామి ఆలయ సమీపంలో 8 ఎకరాల్లో రూ.700 కోట్ల వ్యయంతో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించబోతున్నారు. అందులో వంద అడుగుల గాలిగోపురం, మూసీ నది మధ్యలో దీవిపై వంద అడుగుల శివుడి విగ్రహం ప్రతిష్టించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు