బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీనే.. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) తెలంగాణ అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ సభ్యుల తీరుపై దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమైన అంశాలపై సభలో చర్చ జరుగుతుంటే వాకౌట్ చేయడం బీఆర్ఎస్ (BRS) సభ్యుల చిత్తశుద్ధి లేమికి నిదర్శన
మంత్రి దుద్దిల్ల


హైదరాబాద్, 28 మార్చి (హి.స.)

తెలంగాణ అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్

సభ్యుల తీరుపై దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమైన అంశాలపై సభలో చర్చ జరుగుతుంటే వాకౌట్ చేయడం బీఆర్ఎస్ (BRS) సభ్యుల చిత్తశుద్ధి లేమికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. గత పదేళ్ల పాలనలో బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. అలాంటిది ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి ఎక్కడిదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు అడుగు ముందుకేస్తుంటే, బీఆర్ఎస్ సభ్యులు అక్కసుతో పది అడుగులు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సభలో చర్చకు నిలబడలేక బీఆర్ఎస్ సభ్యులు బయటకు వెళ్లడంపై మంత్రి శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు. వాకౌట్ (Walk Out) చేస్తే రోజంతా చేయాలి.. కానీ ఇలా బయటకు వెళ్లి, మళ్లీ అలా లోపలికి రావడం ఏంటని ఫైర్ అయ్యారు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారనే విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande