అసెంబ్లీలో శివుని చిత్రపటంతో మంత్రి పొన్నం.. ప్రతిపక్షం అభ్యంతరం
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సభలో మంత్రి శివపార్వుతులు వారిద్దరి కుమారులకు సంబంధించిన చిత్రపటాన్ని మంత్రి సభలో ప్రదర్శించారు. దీంతో రూల్స్ ప
శివుని చిత్రపటం


హైదరాబాద్, 28 మార్చి (హి.స.)

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సభలో మంత్రి శివపార్వుతులు వారిద్దరి కుమారులకు సంబంధించిన చిత్రపటాన్ని మంత్రి సభలో ప్రదర్శించారు. దీంతో రూల్స్ ప్రకారం సభలో ఫోటోలు చూయించవద్దు కదా అని ప్రతిపక్ష సభ్యులు అడ్డు చెప్పడంతో తాను అనుమతి తీసుకున్నానని చెప్పారు.

ఇవాళ సభలో రవాణాశాఖ, బీసీ సంక్షేమ శాఖకు కేటాయింపులపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇస్తూ. ఇటీవల వేములవాడకు శృంగేరి పీఠాధిపతి వచ్చినప్పుడు అక్కడ శంకరుడి కుటుంబానికి సంబంధించిన చిత్ర పటాన్ని చూపిస్తూ అందులోని వైరుద్యాలు ఉన్నా కలిసి ఉండాల్సిన విషయాలను వివరించారని చెప్పారు. శంకరుని పరివారానికి సంబంధించిన చిత్రపటంలో శంకరుని వాహనం నంది, పార్వతి వాహనం సింహం, కుమారస్వామి వాహనం నెమలి, వినాయకుడి వాహనం ఎలుక ఉంటాయి. వీటిలో ఒకదానికి మరొక దానితో పడదు. కానీ దైవభక్తి విషయంలో అన్ని కలిసే ఉంటున్నాయన్నారు.

కాగా గతంలో లోక్ సభలో ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభలో శివుడి చిత్రపటాన్ని ప్రదర్శించడం కాంట్రవర్సీగా మారింది. దీన్ని స్పీకర్ ఓం బిర్లా ఖండించారు. సభలో ఎలాంటి ప్రకార్డులు లేదా గుర్తులు చూపించకూడదని చెప్పిన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande