
అమరావతి, 28 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు, డీజిల్ కొరత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణంగా తలెత్తిన పరిస్థితులపై శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ దేశంలోని అందరు సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ఇంధన పరిస్థితిని వివరించారు. ఎల్పీజీ సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని, ప్యానిక్ బుకింగ్తో సమస్యలు వస్తున్నాయని ప్రధానికి తెలిపారు. రాష్ట్రంలో పీఎన్జీ కనెక్షన్లను ప్రోత్సహిస్తున్నామన్నారు. సప్లయ్ చైన్ దెబ్బతినకుండా అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. పెట్రోలు, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రత్యక్షంగా ప్రజలకు లబ్ధి కలిగించకపోయినా చమురు కంపెనీలకు ఊరట కలిగిస్తుందని.. తద్వారా అవి ప్రజలపై భారం మోపకుండా ఉంటాయని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ