ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ – లబ్ధిదారులకు ఉపశమనం
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఈసారి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక చర్య చేపడుతున్నట్లు అధికారులు
రేషన్ బియ్యం


హైదరాబాద్, 28 మార్చి (హి.స.)

రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఈసారి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక చర్య చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని చౌక ధరల దుకాణాల ద్వారా మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయడానికి ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పౌరసరఫరాలశాఖ వర్గాలు తెలిపాయి. లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల బియ్యం పొందే విధంగా సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నిర్ణయం వల్ల రేషన్ లబ్ధిదారులకు సౌకర్యం కలగడంతో పాటు, తరచూ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇది మరింత ఉపయోగకరంగా ఉండనుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత సులభతరం అవుతుందని, లబ్ధిదారులు సమయానికి అవసరమైన ధాన్యం పొందగలరని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande