ఆగిఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
చిత్తూరు, 28 మార్చి (హి.స.)రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే దుర్మరణం పాలైన విషాద ఘటన చిత్తూరు (Chittoor) జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీ
ఢీకొట్టిన కారు


చిత్తూరు, 28 మార్చి (హి.స.)రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే దుర్మరణం పాలైన విషాద ఘటన చిత్తూరు (Chittoor) జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి కారు అతివేగంతో అదుపుతప్పి బలంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు వరంగల్ (Warangal) జిల్లాకు చెందిన శ్రీధర్ రావు, లక్ష్మీ, అద్వికగా గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుమలకు కారులో వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande