
తిరుపతి, 28 మార్చి (హి.స.)
తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ మరోసారి హల్ చల్ చేసింది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. అయితే, ఇంటి యజమాని సునంద కుమార్ రెడ్డి సకాలంలో అప్రమత్తం కావడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దొంగల కదలికలకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
బాధితుడు సునంద కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. చెడ్డి గ్యాంగ్ ఆగడాలతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV