
అమరావతి, 28 మార్చి (హి.స.)
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధానిని మార్చాలనే ఆలోచన ప్రపంచంలో జగన్కు తప్ప ఎవరికీ రాదని అభిప్రాయపడ్డారు. జగన్కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉందని, రేపు అమరావతిని నేనే కట్టానని జగన్ చెప్పినా ఆశ్చర్యం లేదని విమర్శించారు. జగన్ పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తానంటున్నారు.. జగన్కు ప్రజలు చూపించిన బ్లాక్బస్టర్ సినిమా సరిపోలేదేమోనని చురకలంటించారు.
అమరావతి తీర్మానానికి రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలు ఆనందిస్తున్నారు.. రాష్ట్రంలో మరోసారి తుగ్లక్ చర్యలు చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని మండిపడ్డారు. ఈ రాత్రికి అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి వెళ్తుంది.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ‘అమరావతి’కి చట్టబద్ధత రావొచ్చని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV