
తిరుమల, 28 మార్చి (హి.స.)
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)కు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Queue Complex)లోని 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ (TTD) సిబ్బంది క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
ఇక శుక్రవారం ఒక్కరోజే మొత్తం 67,526 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా 25,780 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారిపై భక్తులు తమ భక్తిని చాటుకుంటూ భారీగా కానుకలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV