అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం హర్షణీయమే: షర్మిల
అమరావతి, 28 మార్చి (హి.స.)అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం హర్షణీయమే అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమేనని, మళ్లీ ఏ జగన్ లాంటోళ్ల
షర్మిల


అమరావతి, 28 మార్చి (హి.స.)అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం హర్షణీయమే అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమేనని, మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే.. అని ముందుచూపు ఉండడం మీ విజన్ కి నిదర్శనం అనుకుందాం.. మరి రాజధాని కోసం విభజన చట్టంలో పెట్టిన సెక్షన్ 94(3) సంగతేంటి చంద్రబాబు గారూ ? అని ప్రశ్నించారు. సెక్షన్ 5 ( సబ్ సెక్షన్ 2) లో ఎట్ అమరావతి పదాన్ని పెట్టించేందుకు ఉన్న శ్రద్ధ.. సెక్షన్ 94(3) కింద అమరావతి ఫండ్స్ అడిగేందుకు లేదా? గెజిట్ తోనే అమరావతి గెయిన్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అని తెలియదా ? ఎంతైతే అంత కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే అనే క్లాజ్ సెక్షన్ 94(3d) చదవలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

‘కేంద్రం చేస్తున్న మోసంపై వద్దా అసెంబ్లీ తీర్మానం ? నిధులు హక్కుగా ఇవ్వాల్సిందేనని చేయొద్దా తీర్మానం ? విభజన చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తుంటే అసెంబ్లీ వేదికగా తీర్మానం వద్దా? మోడీ గారిచ్చిన చెంబుడు నీళ్లు,తట్టెడు మట్టితో సరిపెట్టుకుందామా ? ఇదే బీజేపీ రాజధానికి ఇచ్చిన గొప్ప ప్రసాదంగా భావిద్దామా ? అసలొద్దు.. అప్పులిప్పిస్తే చాలని రాజీపడదామా? పదో పరకో ముష్టిగా పడేస్తుంటే ఇప్పటికింతే సంతోషం అనుకుందామా? అమరావతికి నిర్మాణానికి పట్టే రూ.1 లక్ష కోట్లు ప్రజల నెత్తిమీద వేద్దామా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సంధిస్తున్న ప్రశ్నలపై కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande