డ్రంక్ అండ్ డ్రైవ్ పై కామారెడ్డి జిల్లా పోలీసుల స్పెషల్ ఫోకస్.. ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, 29 మార్చి (హి.స.) జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీ
కామారెడ్డి పోలీస్


కామారెడ్డి, 29 మార్చి (హి.స.)

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను

అరికట్టడం, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో భారీ సంఖ్యలో వాహనదారులు మద్యం సేవించి నడుపుతూ పట్టుబడ్డారు. శనివారం ఒక్కరోజే పట్టుబడిన 553 మందిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలను విధించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 553 మందికి కోర్టు శిక్షలు విధించింది. ఇందులో ఒకరికి 5 రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన వారందరికీ కలిపి మొత్తం రూ.6,38,500 జరిమానా విధించింది.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం కేవలం చట్టపరమైన నేరమే కాకుండా, ప్రాణాంతక పరిణామాలకు దారితీసే ప్రమాదకర చర్య అని తెలిపారు. మద్యం మీ కళ్లను తాత్కాలికంగా మూయవచ్చు.. కానీ మీ కుటుంబ కళ్లలో కన్నీరు నింపకండి అని ప్రజలను హెచ్చరించారు. తాత్కాలిక మత్తులో తీసుకునే నిర్లక్ష్య నిర్ణయాలు కుటుంబాల జీవితాలను శాశ్వతంగా దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు తన కుటుంబం తో పాటు సమాజం పట్ల బాధ్యతను గుర్తుంచుకుని మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande