దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన
అమరావతి, 30 మార్చి (హి.స.) దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. సోమవారంత భారీ వర్షంతో పాటు వడగళ్లు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా హిమాచల
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన


అమరావతి, 30 మార్చి (హి.స.)

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. సోమవారంత భారీ వర్షంతో పాటు వడగళ్లు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాలతో పాటు దక్షిణ రాష్ట్రాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో విస్తారంగా వర్షం, మంచు కురవడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తుఫానులు ఉంటాయని పేర్కొంది. అలాగే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక కాశ్మీర్ లోయలో అక్కడక్కడా భారీ వర్షం లేదా హిమపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande