రాష్ట్రంలో త్వరలో రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు.. మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, 29 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు నేతృత్వంలో తెలంగాణ
పొన్నం


హైదరాబాద్, 29 మార్చి (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో

రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు నేతృత్వంలో తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ కన్వీనర్ బి. వెంకటేశం, ఏఐటీయూసీ సీనియర్ నాయకులూ వి.ఎస్. బోస్, జేఏసీ నేతలు ఎంఏ. సలీమ్, ఆదివారం అసెంబ్లీ లో ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఆటో డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో మీటర్ చార్జీలు పెంచాలని కోరారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వమే ఒక యాప్ ఏర్పాటు చేయాలని, ఎల్పీజీ గ్యాస్ కొరతను నివారించాలని, జి.ఓ. నెంబర్ 263 ప్రకారం మిగిలిన ఆటో పేర్మిట్లను వెంటనే జారీ చేయాలనీ వారు విజ్ఞప్తి చేసారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మీటర్ రేట్ల పెంపును, రూ. 12 వేలు ఆర్థిక సహాయం వంటివి సీఎం దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. యాప్ కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని, మిగిలిన ఆటో పేర్మిట్లను వెంటనే ఇస్తామని చెప్పారు అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande