
హైదరాబాద్, 29 మార్చి (హి.స.) అనుమతులు లేకుండా కరాటే క్లాస్ ల
పేరుతో ఇందిరా పార్కులో అక్రమ నిర్మాణాలు చేపట్టి కబ్జాలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని ఇందిరా పార్కును సీపీఐ జాతీయ నాయకుడు నారాయణతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు చెందిన ఇందిరా పార్క్ ఎలాంటి అనుమతులు లేకుండా కరాటే తరగతులు నిర్వహించడమే కాకుండా గోడలు కూల్చివేసి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఇలాంటి అక్రమాలకు సహకరిస్తున్న నాయకుల పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు