నెల్లూరు జిల్లాలో జంట హత్యల కలకలం
నెల్లూరు, 30 మార్చి (హి.స.) కొడవలూరు: శ్రీపొట్టిశ్రీరాములు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. కొడవలూరు మండలం గండవరం పొలాల్లో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. దస్తగిరి మండలానికి చెందిన వెంకటేశ్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య (26)ను గుర్తు తెల
నెల్లూరు జిల్లాలో జంట హత్యల కలకలం


నెల్లూరు, 30 మార్చి (హి.స.)

కొడవలూరు: శ్రీపొట్టిశ్రీరాములు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. కొడవలూరు మండలం గండవరం పొలాల్లో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. దస్తగిరి మండలానికి చెందిన వెంకటేశ్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య (26)ను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. మృతుల శరీరంపై కత్తితో పొడిచినట్లు గాయాలు ఉన్నాయి. పాత కక్షలతోనే ఈ హత్యలు జరిగాయా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande