
అమరావతి, 30 మార్చి (హి.స.): కరువు మండలాల్లోని విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు వేసవిలో డ్రై రేషన్ పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గతేడాది గుర్తించిన 51 కరువు మండలాల్లో విద్యార్థులకు వేసవిలో డ్రైరేషన్ ఇవ్వాలని మధ్యాహ్న భోజన విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో విద్యార్థికి... ప్రాథమిక పాఠశాలల్లో 4 కిలోల బియ్యం, ఉన్నత పాఠశాలల్లో 6కిలోల బియ్యం, 35 గుడ్లు, 21 చిక్కీలు అందజేస్తారు. రెండు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ