ఈ ఏడాది కూడా రుతుపవనాలు ఆలస్యమేనా?
అమరావతి, 30 మార్చి (హి.స.) ఈ ఏడాది అంతర్జాతీయంగా ''ఎల్-నినో'' (El-Nino) పరిస్థితులు బలపడుతుండటంతో, భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది వాతావరణం ప్రధ
andhra-pradesh-weather-heatwave-in-rayalaseema-rain-alert-for-coastal-district


అమరావతి, 30 మార్చి (హి.స.)

ఈ ఏడాది అంతర్జాతీయంగా 'ఎల్-నినో' (El-Nino) పరిస్థితులు బలపడుతుండటంతో, భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది వాతావరణం ప్రధానంగా 2023 నాటి తీవ్ర పరిస్థితులను గుర్తుకు తెచ్చేలా ఉంటుందని, వేసవి కాలం రెండు దశల్లో తన ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేస్తున్నారు. వేసవి కాలం మొదటి భాగం, అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు, వాతావరణం కొంత భిన్నంగా ఉండబోతోంది. సాధారణంగా వేసవి ప్రారంభంలో ఉండాల్సిన ఎండల కంటే, ఈ కాలంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే మార్చి నెలలో మనం చూస్తున్నట్లుగా, క్రమం తప్పకుండా వర్షాలు కురవడం వల్ల ఏప్రిల్ వరకు ఉష్ణోగ్రతలు నియంత్రణలోనే ఉంటాయి. దీనివల్ల సాధారణ వేసవి తాపం కంటే తక్కువ వేడి నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వర్షాలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, ఇవి అస్థిరమైన వాతావరణానికి సంకేతాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మేలో అదిరిపోయే ఎండలు

అసలైన వేసవి రెండో భాగంలో ఎదురుకానుంది. మే నెల నుండి జూన్ మధ్య వరకు వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోతుంది. ఈ సమయంలో 'మాసివ్ హీట్వేవ్స్' వీచే అవకాశం ఉంది. ఎల్-నినో ప్రభావం వల్ల భూమిపై వేడి విపరీతంగా పెరిగి, ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవచ్చు. ముఖ్యంగా పగటిపూట నిప్పులు చెరిగే ఎండలతో పాటు, రాత్రిపూట కూడా వేడి గాలి వీయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ దశలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇది ఆరోగ్యానికి మరియు వ్యవసాయానికి సవాలుగా మారుతుందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది.

రుతుపవనాల ఆలస్యం!

అలాగే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకాల్సిన రుతుపవనాలు, ఎల్-నినో వల్ల జూన్ రెండో వారం లేదా ఆ తర్వాతే వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వేసవి కాలం మరింత సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ పరిణామం వల్ల జూన్ నెలలో కూడా ఎండల తీవ్రత తగ్గకపోవడమే కాకుండా, వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంది. 2023లో కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తాయని, ఆ ఏడాది ఎండలు, వర్షాల కొరత ఏ విధంగా ఇబ్బంది పెట్టాయో, ఈ ఏడాది కూడా అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande