మా కొద్దు.. ఈ ఇందిరమ్మ ఇళ్లు!
హనుమకొండ, 31 మార్చి (హి.స.)తలదాచుకునేందుకు గూడు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు నీడనిస్తాయని ఆశప డ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయింది. ఇండ్లు మంజూరైవారు ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో ఇళ్లు కట్టుకోవచ్చునని సంతోషపడ్డారు. తాముంటున్న గుడిసెలను
Congress


హనుమకొండ, 31 మార్చి (హి.స.)తలదాచుకునేందుకు గూడు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు నీడనిస్తాయని ఆశప డ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయింది. ఇండ్లు మంజూరైవారు ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో ఇళ్లు కట్టుకోవచ్చునని సంతోషపడ్డారు. తాముంటున్న గుడిసెలను తొ లగించి ఆ స్థలంలోనే ఇళ్లను మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి వారికి చు క్కలు కనిపిస్తున్నాయి. అటు ఇల్లు పూర్తికాక.. ఇటు ఉన్న నీడ కూడా పోయి రెంటికి చెడిన రేవడి చందంగా మారింది. వీరి పరిస్థితిని చూసిన మిగతా లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టడానికి జంకుతున్నారు. మరికొంత మంది తమకు మంజూరైన ఇళ్లు తమ వల్లకాదని రద్దు చేసుకుంటున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లుల చెల్లింపులో తీవ్రజాప్యం జరుగుతోంది. లబ్ధిదారులు మొదట తమ సొంత డబ్బుతో ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత దశల వారిగా బిల్లులను చెల్లిస్తారు. అయితే పునాదులు పూర్తయిన ఇళ్లకే సకా లంలో మొదటి విడత బిల్లు రావడం లేదు. అది వస్తే తప్పా లబ్ధిదారులు నిర్మాణం విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి. బిల్లు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నామని లబ్ధిదారులు వాపోతు న్నారు. సాంకేతిక సమస్యలు, బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పలు వల్ల తొలి విడత బిల్లే పెండింగ్లో పడుతున్నది. శ్లాబ్ పనులు పూర్తయినా ఇళ్లకు బిల్లుల చెల్లింపులో ప్రాధాన్యత ఇవ్వాలన్న స్ప ష్టమైన ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరో పణలు వినవస్తున్నాయి. కొంత ఆర్థిక స్థోమత ఉన్నవారు ఇంటి నిర్మాణాలు చేపట్టినా వారి ఖాతాల్లో అనుకున్న సమయంలో బిల్లుపడకపోవడంతో ఎందుకు ఇంటి నిర్మాణం చేపట్టామా అని తలలు పట్టుకుంటున్నారు. బిల్లుల చెల్లింపు జాప్యంతో నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోయి ఇళ్ల నిర్మాణంలో ఆశించినంత పురోగతి కనిపించడం లేదు.

జిల్లాలో డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణ పరిస్థితి కూడా అధ్వాన్నం గా ఉంది. ఏళ్లు గడుస్తున్నా చాలాచోట్ల ఇప్పటికీ పూర్తికాలేదు. పూర్తయిన చోట్ల లబ్ధిదారులకు కేటాయింపులు జరగడం లేదు. జిల్లాకు 4219 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయిం చింది. రూ.228.27 కోట్ల వ్యయంతో వీటిని చేపట్టాల్సి ఉంది. ఈ ఇళ్లలో ఇప్పటి వరకు 2480కి టెండర్లు ఖరారయ్యాయి. 2158 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 109 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. 213 ఇళ్ల పనులు అసలే ప్రారంభం కాలేదు. 24 ఇళ్లు పునాదుల వరకు, 7 ఇళ్లు స్తంభాల వరకు, 15 ఇళ్లు గోడల వరకు 63 ఇళ్లు ప్లాస్టరింగ్ వరకు వచ్చాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande