
కృష్ణా జిల్లా, 31 మార్చి (హి.స.)కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్స్టేషన్కు చెందిన వాహనంలో పేలుడు సంభవించింది. దీపావళి సందర్భంగా సీజ్ చేసిన టపాసులను తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు వాహనంలో టపాసులు ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎస్సై సహా నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసు వాహనంలో టపాసులు తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్