కువైట్ వద్ద ట్యాంకర్పై దాడి.. సముద్రంలోకి ఒలికిన చమురు
ఢిల్లీ, 05 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ఘర్షణలు నెలకొన్న వేళ... కువైట్ (Kuwait) జలాల్లో చమురు ట్యాంకర్పై దాడి జరిగింది. దాంతో ఇంధనం సముద్రంలోకి ఒలికింది. ఈ మేరకు గురువారం బ్రిటన్కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. ‘‘కువైట్లోని ముబార
కువైట్ వద్ద ట్యాంకర్పై దాడి.. సముద్రంలోకి ఒలికిన చమురు


ఢిల్లీ, 05 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ఘర్షణలు నెలకొన్న వేళ... కువైట్ (Kuwait) జలాల్లో చమురు ట్యాంకర్పై దాడి జరిగింది. దాంతో ఇంధనం సముద్రంలోకి ఒలికింది. ఈ మేరకు గురువారం బ్రిటన్కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. ‘‘కువైట్లోని ముబారక్ అల్ కబీర్ పోర్ట్ సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని, ఆ తర్వాత అక్కడినుంచి ఒక చిన్న బోటు వెళ్లిపోవడం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ట్యాంకర్ నుంచి ఒలికే ఇంధనం వల్ల పర్యావరణంపై ప్రభావం ఉండొచ్చు’’ అని ఏజెన్సీ పేర్కొంది.

ఎగుమతులు నిలిపివేయండి: చైనా

డీజిల్, గాసోలిన్ ఎగుమతులు నిలిపివేయాలని చైనా తన రిఫైనరీలకు సూచించింది. అలాగే గల్ఫ్ దేశాలకు తన సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చైనాకు చెందిన షిప్పింగ్ సంస్థ COSCO వెల్లడించింది. ఇదిలాఉండగా, ఆరోరోజు ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande