ఖమేనీ హత్యపై కశ్మీర్లో తీవ్రమవుతున్న నిరసనలు
శ్రీనగర్‌: /ఢిల్లీ, 07మార్చి (హి.స.)ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా కశ్మీర్‌ లోయలో ఆందోళనలు ఉద్రిక్తమవుతున్నాయి. శుక్రవారం జుమా నమాజ్‌ అనంతరం ఆందోళనలు పెరిగే అవకాశముందని భావించిన అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. దీనిపై
ఖమేనీ హత్యపై కశ్మీర్లో తీవ్రమవుతున్న నిరసనలు


శ్రీనగర్‌: /ఢిల్లీ, 07మార్చి (హి.స.)ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా కశ్మీర్‌ లోయలో ఆందోళనలు ఉద్రిక్తమవుతున్నాయి. శుక్రవారం జుమా నమాజ్‌ అనంతరం ఆందోళనలు పెరిగే అవకాశముందని భావించిన అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. దీనిపై హురియత్‌ కాన్ఫరెన్స్‌ ఛైర్మన్, ప్రధాన మత గురువు మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంక్షల నేపథ్యంలో తనను గృహ నిర్బంధంలో ఉంచారని, జామియా మసీదును అధికారులు మూసివేశారని మండిపడ్డారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ఇటువంటి ఆంక్షలు విధించడం దురదృష్టకరమని ‘ఎక్స్‌’ వేదికగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

3

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande