బిహార్ సీఎం పదవికి నితిష్ కుమార్ రాజీనామా!శకం ముగిసింది..
పాట్నా:/ఢిల్లీ, 05 మార్చి (హి.స.) బీహార్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్నట్లు నితీష్ కుమార్ అధికారికంగా ప్రకటన చేశారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్టు క్లా
nitish  kumar


పాట్నా:/ఢిల్లీ, 05 మార్చి (హి.స.) బీహార్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్నట్లు నితీష్ కుమార్ అధికారికంగా ప్రకటన చేశారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి బీహార్ ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ మొదలైంది.

బిహార్లో సీఎం నితీష్ కుమార్ శకం ముగిసింది. సీఎం పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలని కోరుకుంటున్నాను. రెండు దశాబ్దాలుగా నాపై నమ్మకం ఉంచారు. అంకితభావంతో బీహార్ అభివృద్ధి కోసం పనిచేశారు’ అని పేర్కొన్నారు.

,

ఈ మేరకు జాతీయ మీడియాలో ఇద్దరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టవచ్చని తెలుస్తోంది. అలాగే, నిత్యానంద రాయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక, సామ్రాట్ చౌదరి బీహార్ రాజకీయాల్లో అంతర్భాగంగా ఉన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పటి నుండి ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వరకు బీజేపీ నాయకుడిగా కీలక పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande