
ముంబయి, 05మార్చి (హి.స.) దేశీయ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి భారీ నష్టాలను చవిచూసిన సూచీలు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు సెంటిమెంట్ను కాస్త బలపరిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 500 పాయింట్ల వరకు పెరిగింది.
ఉదయం 9.42 గంటల సమయంలో 273 పాయింట్ల లాభంతో 79,389 వద్ద ఉండగా.. నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 24,570 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా, ఓఎన్జీసీ, రిలయన్స్, అదానీ పోర్ట్స్, లార్సెన్ షేర్లు రాణిస్తున్నాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, మ్యాక్స్ హెల్త్కేర్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.54గా ఉంది. అయితే, యుద్ధభయాల కారణంగా సూచీల్లో ఊగిసలాట కనిపిస్తోంది. బుధవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా.. నేటి ట్రేడింగ్లో ఆసియా మార్కెట్లు కూడా అదే బాటలో ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ