14 జిల్లాలకు ‘బర్డ్ ఫ్లూ’ వ్యాప్తి
చెన్నై, 05మార్చి (హి.స.) రాష్ట్రంలోని 14 జిల్లాలకు ‘బర్డ్ ఫ్లూ’ విస్తరించిందని ఆరోగ్యశాఖ తెలిపింది. అడయార్లో జనవరి 5వ తేది వరుసగా కాకులు మృతిచెందాయి. వాటి నమూనాలు పరిశీలించిన జాతీయ పశువైద్య పరిశోధనసంస్థ, కాకుల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారించిం
Bird flu in Alappuzha


చెన్నై, 05మార్చి (హి.స.) రాష్ట్రంలోని 14 జిల్లాలకు ‘బర్డ్ ఫ్లూ’ విస్తరించిందని ఆరోగ్యశాఖ తెలిపింది. అడయార్లో జనవరి 5వ తేది వరుసగా కాకులు మృతిచెందాయి. వాటి నమూనాలు పరిశీలించిన జాతీయ పశువైద్య పరిశోధనసంస్థ, కాకుల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో, నగరం అనంతరం తిరువళ్లూర్, తిరువణ్ణామలై, కడలూరు సహా 14జిల్లాలు, పుదుచ్చేరి రాష్ట్రంలోనూ బర్డ్ ఫ్లూతో కాకులు మృతిచెందుతున్నాయి. ఈ విషయమై ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ...రాష్ట్రంలో 14 జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా కాకులు మృతిచెందుతున్నాయన్నారు. ఇతర పక్షులకు, మనుషుల్లో ఈ వ్యాధి ఇప్పటివరకు సోకలేదన్నారు. అయినా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే సమయంలో, జ్వరం లక్షణాలుంటే సత్వరం ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande