
ముంబై, 06 మార్చి (హి.స.)
రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్
చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ పవర్తో పాటు దాని అనుబంధ సంస్థలపై ఇవాళ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు (Enforcement Directorate) ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ముంబైతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే, నగదు అక్రమ చలామణి(Money Laundering) కేసులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది. రిలయన్స్ పవర్కు చెందిన కొన్ని ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సోదాల అనంతరం ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా అనిల్ అంబానీకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు, రిలయన్స్ పవర్తో సంబంధం ఉన్న డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు రెయిడ్స్ కొనసాగుతున్నాయి. గతంలో కూడా 'పండోరా పేపర్స్' లీక్, ఇతర ఆర్థిక లావాదేవీల కేసుల్లో అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరై విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా ఈ దాడుల వార్త బయటకు రావడంతో స్టాక్ మార్కెట్లో రిలయన్స్ పవర్ షేర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని బిజినెస్ ఎక్స్పర్ట్స్ బావిస్తున్నారు. విశ్లేషకులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..