
బెంగళూరు: , 06 మార్చి (హి.స.)కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. అసెంబ్లీ సమావేశాల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మొబైల్ వినియోగంతో కలిగే దుష్ప్రభావాలను సిద్ధరామయ్య ప్రస్తావించారు. పిల్లలపై మొబైల్స్ దుష్ప్రభావం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయడానికి బ్యాన్ చేసినట్లు సీఎం తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్ మీడియాపై నిషేధం ఉండగా.. ఫిన్లాండ్, యూకే కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.
కాగా, సోషల్ మీడియాతో ప్రయోజనాలే కాదు.. అనర్థాలూ పొంచి ఉన్నాయి. ఆ ప్లాట్ఫారమ్లలో అసభ్యకరమైన కంటెంట్ను చూడటం, వేధింపులకు గురికావడంతో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశాన్ని పలు దేశాలు ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ