
ముంబై: , 06 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా వరుసగా మూడు రోజులు భారీ నష్టాలు చవిచూసిన భారత స్టాక్ మార్కెట్కు ఎట్టకేలకు ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్ ఆరంభం నుంచి పాజిటివ్గా ట్రేడైన సూచీలు.. ఆఖరి గంటలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారీ లాభాలను నమోదు చేశాయి. ఒక దశలో 1,187.64 పాయింట్లు ఎగబాకి 80,303.83 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్.. చివరికి 899.71 పాయింట్ల (1.14 శాతం) లాభంతో 80,015.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 285.40 పాయింట్ల (1.17 శాతం) వృద్ధితో 24,765.90 వద్ద క్లోజైంది. కొనుగోళ్ల జోరుతో ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) రూ.5.72 లక్షల కోట్లు పెరిగి రూ.452.90 లక్షల కోట్లకు (4.94 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. సెన్సెక్స్లోని 30 నమోదిత కంపెనీల్లో 19 రాణించాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ