
ఢిల్లీ, 06 మార్చి (హి.స.)అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, సప్లయ్ చైన్లో ఇబ్బందుల దృష్ట్యా ఎల్పీజీ (LPG) సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య ప్రజలకు ఎక్కడా గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు ‘హౌస్హోల్డ్ ఫస్ట్’ విధానం అమల్లోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేశంలోని ప్రధాన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఐవోసీఎల్ (IOCL), బీపీసీఎల్ (BPCL), హెచ్పీసీఎల్ (HPCL) సంస్థలకు కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలను పంపింది. ఉత్పత్తి అవుతున్న, దిగుమతి చేసుకుంటున్న ఎల్పీజీలో మెజారిటీ భాగం గృహ వినియోగదారులకే (Domestic Consumers) చేరేలా చూడాలని స్పష్టం చేసింది. సాధారణంగా పండుగల సీజన్, అంతర్జాతీయంగా సరఫరా ఇబ్బందులు తలెత్తినప్పుడు గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల కోసం వెయింటింగ్ పీరియడ్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా ‘హౌస్హోల్డ్ ఫస్ట్’ (Household First) విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. దీంతో సామాన్య ప్రజలకు సకాలంలో సిలిండర్లు అందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV