99రోజుల యాక్షన్ ప్లాన్కు ప్రత్యేక లోగో : అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ
నాగర్ కర్నూల్, 07 మార్చి (హి.స.) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం మూడోసారి ప్రజల్లోకి వెళుతోందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివర
MLA


నాగర్ కర్నూల్, 07 మార్చి (హి.స.)

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం

చేపట్టిన తర్వాత ప్రభుత్వం మూడోసారి ప్రజల్లోకి వెళుతోందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు గ్రామసభల నిర్వహణకు మరోమారు అధికారులు ప్రజాప్రతినిధులు సమయతమవుతున్నారని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరిట చేపటనున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అచ్చంపేట పట్టణ మున్సిపల్ వార్డుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రతి కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలను ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించామన్నారు. పట్టణంలో ఒకటవ వార్డులో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు వై.శ్రీనివాసులు, శారదమ్మ, రతన్ సింగ్, ఇతర స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande