చట్టాలు చేయడంతోనే ప్రభుత్వాల బాధ్యత తీరదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 07 మార్చి (హి.స.) మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రభుత్వాల బాధ్యత నెరవేరుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లోని
CM revanth Reddy


హైదరాబాద్, 07 మార్చి (హి.స.)

మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం

కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రభుత్వాల బాధ్యత నెరవేరుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లోని జేఎన్టీయూ (JNTU)లో నిర్వహించిన 'స్టాండ్ విత్ హర్ ' (Stand With Her) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతపై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అందుకే తమ ప్రభుత్వం మహిళల ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు శక్తిమేర పదవులను కట్టబెట్టడమే కాకుండా, ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు.

ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు..

మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రేవంత్ రెడ్డి వివరించారు. హైటెక్ సిటీ వంటి ఖరీదైన ప్రాంతం పక్కనే మహిళా ఉత్పత్తుల విక్రయం కోసం 'ఇందిరా మహిళా స్టాల్స్'కు స్థలం కేటాయించినట్లు వెల్లడించారు. అదేవిధంగా గ్రామీణ మహిళల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ, వారి ఉత్పత్తులను ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా విక్రయించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. కేవలం ఉచిత ప్రయాణమే కాకుండా, మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులను నడిపిస్తూ వారిని వ్యాపార భాగస్వాములుగా మార్చామన్నారు.

తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడంలో మహిళల కృషి ఎంతో ఉందని సీఎం కొనియాడారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారికి అన్ని వేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande